![]() |
![]() |
.webp)
ఈటీవీలో ఒక రేంజ్ లో అలరించి కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన షోస్ "ఆలీతో సరదాగా" "క్యాష్".. వీటి స్థానంలో "సుమ అడ్డా" పేరుతో ఒక షో టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. చూస్తుంటే బ్రేక్ తీసుకున్న ఈ రెండు ప్రోగ్రామ్స్ ని మిక్స్ చేసి సరికొత్తగా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈటీవీలో సుమ హోస్ట్ గా ప్రసారమైన షో "క్యాష్" 12 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా సాగింది.
బుల్లితెర మీద ఎంత మంది యాంకర్స్ వచ్చినా సుమని ఎవరూ బీటౌట్ చేయలేకపోయారు. ఒకవైపు టీవీ షోలు.. మరో వైపు సినిమా ఈవెంట్లను హోస్ట్ చేస్తూ..సెలెబ్స్ ని ఇంటర్వూస్ చేస్తూ... ఫుల్ బిజీగా ఉంటున్నారు సుమ. ఇక ఇప్పుడు ఈ న్యూ షో ‘సుమ అడ్డా’ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వేదిక చూస్తుంటే ఇది సరికొత్త టాక్ షోలా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ షో స్టేజి మీద ఒక పెద్ద, రెండు చిన్న సోఫాలు వేసి ఉన్నాయి. స్టార్ సెలబ్రిటీస్ ని, కాలేజీ స్టూడెంట్స్ ని కూడా తీసుకొచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నారట.
ఇక ఈ షోలో ఫన్, గేమ్స్, ఫైట్, ఎమోషన్, అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ అని టీజర్ లో చూపించారు. ఇక సుమ రెడ్ శారీలో కూలింగ్ గ్లాసెస్ తో ఒక స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు.
![]() |
![]() |